కొండపల్లిలో రచ్చ.. దేవినేని ఉమాపై కేసు నమోదు

26 Nov, 2021 09:08 IST|Sakshi

ఇబ్రహీంపట్నం (విజయవాడ): కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో పోలీస్‌శాఖ విధించిన 144 సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్‌ మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.  144 సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేసి జాతీయ రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు.

ఈ పరిణామాలతో  143, 341, 269, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలియజేశారు. అలాగే గురువారం మధ్యాహ్నం దేవినేని ఉమ, టీడీపీ కార్యకర్తలు కలిసి గొల్లపూడి వన్‌ సెంటర్‌ నుంచి సాయిపురం కాలనీకి వెళ్లే రోడ్డుపై గుంపులు గుంపులుగా చేరి టపాసులు కాలుస్తూ శబ్ద కాలుష్యాన్ని కలిగించారు. దీంతో ఉమాతోపాటుగా పఠాన్‌ అబ్బాస్, ఎ.చిన్న, బొమ్మసాని సుబ్బారావు, రామినేని రాజా, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు