మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు

5 Jan, 2023 15:25 IST|Sakshi

సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఎస్సై ఐ.వీర్రాజు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభాకర్‌ను ప్రభుత్వాసుపత్రి నుంచి పెదవేగి తరలిస్తుండగా సోమవరప్పాడు బైపాస్‌ వద్ద జీపు దిగి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి వెళ్లిపోయారన్నారు.

ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీపు డ్రైవర్, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 2/23తో 341, 24, 506, 353, రెడ్‌ విత్‌ 149 సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్‌పై ఈ నెల 2న కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. 

చదవండి: (చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్‌)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు