ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులపై సీబీ‘ఐ’

16 Mar, 2021 04:07 IST|Sakshi

17 మంది ఆర్మీ అధికారులతో పాటు ఆరుగురిపై కేసు నమోదు

విశాఖతో పాటు దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో సోదాలు 

సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో వివిధ స్థాయిలో అధికారులను నియమించే సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)లోని నియామకాల్లో కొంతమంది అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగి విచారించింది.

దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి, అక్రమాల్లో  15 మంది ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులతో పాటు లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ మేజర్‌ నాయిబ్‌ సుబేదార్, సీపోయ్‌లు, మరో ఆరుగురు ప్రైవేట్‌ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 

మరిన్ని వార్తలు