ప్రైవేటు‌ చేతుల్లోకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

4 Feb, 2021 13:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం కాబోతుంది. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది.

విశాఖ ఉక్కు సంస్థలో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2002 నుంచి 2015 వరకు లాభాలు ఆర్జించింది. 2015 నుంచి 2018 వరకు నష్టాలు చవిచూసింది. 2018-19లో 97 కోట్ల రూపాయలు లాభం సాధించినా తర్వాత మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంది. 

చదవండి:
'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం'

మరిన్ని వార్తలు