దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్‌ డోసుల వేడుక 

13 Oct, 2021 04:28 IST|Sakshi
శాలిహుండంలోని కాలచక్రం

దేశంలోని 100 పురావస్తు కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు 

ఏపీలో ఐదు ప్రాంతాల ఎంపిక 

గార : ఈ నెల 14వ తేదీ గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పురావస్తు కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మొత్తం 100 పురావస్తు కట్టడాల్లో ఈ వేడుకలు జరగనుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుచోట్ల నిర్వహిస్తున్నారు. అవి.. అనంతపురంలోని వీరభద్రస్వామి ఆలయం.. కర్నూలు కొండారెడ్డి బురుజు.. చంద్రగిరిలోని లోవర్‌ ఫోర్టు, గండికోట మాధవపెరుమాళ్‌ గుడి, టవర్, భవనాలు.. శ్రీకాకుళంలోని శాలిహుండం. 14వ తేదీ సా.6 గంటల నుంచి రాత్రి 1గం ట వరకు జరిగే ఈ కార్యక్రమాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించనుంది. ఇక శాలిహుండం బౌద్ధ స్థూపాల్లో ఎంపిక చేసిన కాలచక్రంపై త్రివర్ణ పతాక రూపాన్ని విద్యుత్‌ వెలుగులతో తీర్చిదిద్దుతారు. ఇక కోవిడ్‌ విపత్తును ఎదుర్కోవడంలో ప్రజల సహకారానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు