శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

22 Nov, 2020 09:29 IST|Sakshi

సాక్షి, తిరుమల: పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉడిపి పెజవర్‌ పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి, మధ్యప్రదేశ్ మంత్రి  ఆరవింద బహుదురియా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, పోరుబందర్ ఎంపీ రమేష్ బాయి దుడుకు, జిల్లా నాయ్యమూర్తి రవీందర్ బాబు తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఏకాంతంగా కార్తీక వన భోజనం
తిరుమలలోని పార్వేటి మండపంలో టీటీడీ అధి​కారులు నేడు ఏకాంతంగా కార్తీక వన భోజనం నిర్వహిస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రిమిత సంఖ్య‌లో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్ల‌కు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కార్తీక వ‌న‌భోజ‌నం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా