అగ్రి ఇన్‌ఫ్రాలో ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు

11 Aug, 2020 04:31 IST|Sakshi

పథకం కింద పలు ప్రాజెక్టులు చేపట్టవచ్చు

కమ్యూనిటీ ఫార్మింగ్‌ అసెట్స్‌ పరిధిలోని ప్రాజెక్టులకు ఊతం

సాక్షి, అమరావతి: ‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే.  

► ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది.
► రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా.  
► తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. 
► గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు.

ఈ పథకం ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చునంటే
► ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫారాలు, సప్లై చెయిన్‌ సర్వీసులు
► గిడ్డంగులు, గరిశలు (సిలోస్‌)
► ప్యాక్‌ హౌసులు
► పరీక్ష, తనిఖీ యూనిట్లు
► సార్టింగ్, గ్రేడింగ్‌ యూనిట్లు 
► లాజిస్టిక్‌ సౌకర్యాలు (ఏదైనా ఒక పనికి సంబంధించిన లావాదేవీలన్నీ)
► ప్రాథమిక శుద్ధి కేంద్రాలు
► పండ్లు మాగబెట్టే గదులు 

కమ్యూనిటీ ఫార్మింగ్‌ అసెట్స్‌ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు..
► సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్లు
► జీవన ఎరువుల తయారీ యూనిట్లు
► తక్కువ ఖర్చుతో సాగు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన
► సప్లై చెయిన్‌కు అవసరమైన ప్రాజెక్టులు
► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రోత్సహించే ప్రాజెక్టులు

ఎవరెవరు అర్హులు...
► రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు
► పీఏసీఎస్, మార్కెటింగ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలు, ఎంఎసీలు
► స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు
► ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీ ఎఫ్‌డబ్లు్యతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్‌ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా