హోమియో మందుకు కేంద్రం ఆమోదం

25 Jul, 2021 04:11 IST|Sakshi
వలంటీర్లకు హోమియో మందులను అందిస్తున్న ఎమ్మెల్యే డీఎన్నార్, కమిషనర్‌ రాములు

ఇంటింటికీ కరోనా నివారణ మందు 

ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ రాములు  

కైకలూరు: కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా హోమియో మందుల పంపిణీకి కేంద్రం ఆమోదం తెలిపిందని ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కరోనా నివారణ హోమియో మందులను పంపిణీ చేస్తామని తెలిపారు.  కృష్ణాజిల్లా, కైకలూరులో ‘ప్రాజెక్ట్‌ అమృత్‌’ను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌)తో కలసి శనివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం వలంటీర్లకు ఆర్సెనికం ఆల్బ్‌–30 మందులను అందించారు. రాములు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ వ్యాధుల నివారణకు ఎంతగానో తోడ్పడుతోందని చెప్పారు. కాకినాడ, విశాఖపట్నంలలో 50 పడకల ఆయుష్, నేచురోపతి ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు. గుడివాడలో నూతనంగా నిర్మించే ఆయుష్‌ ఆస్పత్రిలో డీ–ఎడిక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆనందయ్య కంటి చుక్కల మందుపై కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు