శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ

23 Feb, 2022 05:04 IST|Sakshi
ప్రసంగిస్తున్న జీకే పిళ్ళై

వరదయ్యపాళెం: ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణ (ఆర్‌వోడీటీఈపీ) నిర్ణయ కమిటీ బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మాజీ కేంద్ర హోం, వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్ళై (రిటైర్డ్‌ ఐఏఎస్‌) నేతృత్వంలో రిటైర్డ్‌ సీబీఈసీ స్పెషల్‌ సెక్రటరీ వైజీ పరాండే, కస్టమ్స్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ చీఫ్‌ కమిషనర్‌ (రిటైర్డ్‌) గౌతమ్‌ రే కమిటీ సభ్యులుగా సందర్శనకు రాగా వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అండర్‌ సెక్రటరీ అసన్‌ అహ్మద్, డిప్యూటీ డీజీఎఫ్‌టీ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. శ్రీసిటీ ఎస్‌ఈజెడ్, డీటీజెడ్‌లోని పరిశ్రమల సీనియర్‌ మేనేజర్లతో వీరు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు.

పిళ్ళై మాట్లాడుతూ..తక్కువ వ్యవధిలో శ్రీసిటీ సాధించిన పారిశ్రామిక వృద్ధిని ప్రశంసించారు. ఎగుమతులపై సుంకాలు, పన్నులు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతులకు ఆర్‌ఓడీటీఈపీ రేట్లను నిర్ణయించడానికి ఎగుమతి అథారిటీ పరిశ్రమల అభిప్రాయాలను తమ కమిటీ సేకరిస్తుందన్నారు. పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తమ ఉత్పత్తుల ధరలను నిర్దేశిత ఫార్మాట్‌లో ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. కమిటీకి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు