గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.581.7 కోట్లు

1 Sep, 2021 08:54 IST|Sakshi

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం 

సాక్షి, అమరావతి: 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు టైడ్‌ గ్రాంట్‌ రూపంలో మొదటి విడతగా కేంద్రం మంగళవారం రూ.581.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం 70–15–15 నిష్పత్తిలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. నిబంధనల ప్రకారం.. టైడ్‌ గ్రాంట్‌ రూపంలో ఇచ్చే నిధులను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లు గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదల కార్యక్రమాలకు మాత్రమే ఖర్చుపెట్టాలి.

15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేటాయించారు. అందులో బేసిక్‌ గ్రాంట్‌ మొదటి విడతగా రూ.387.80 కోట్లను ఇప్పటికే కేంద్రం విడుదల చేయగా, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు బదలాయించింది.

ఇవీ చదవండి:
ఏపీ మరో రికార్డు..  
రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం

మరిన్ని వార్తలు