విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్న కేంద్రం

2 Aug, 2021 15:44 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, న్యూ ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్‌ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది.
 

మరిన్ని వార్తలు