ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే ప్రశంసలు

28 May, 2022 16:23 IST|Sakshi

జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టిన గొప్పవ్యక్తి 

సాక్షి, వరంగల్‌: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప వ్యక్తి అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్‌ అథవాలే కొనియాడారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన ‘దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు.

కొందరు దళిత, బహుజన వ్యతిరేకులు అంబేడ్కర్‌ పేరు వద్దని ఆందోళనలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ రోజు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మన మధ్యలో ఉంటే భారత ప్రధాని అయ్యేవారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుందని అథవాలే తెలిపారు. సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు