సింహాచలం: కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బృందం పర్యటన

13 Aug, 2021 11:59 IST|Sakshi

కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై చర్చించిన మంత్రి అవంతి

సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ చర్చించారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టామని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. గిరి ప్రదక్షిణ కోసం ఒక మట్టి రోడ్‌తో ట్రాక్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు.

పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి  ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ, ఈ పథకం పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందన్నారు. పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని ఎస్‌.ఎస్‌.వర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు