'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమం: మంత్రి

26 Nov, 2020 14:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ఏర్పాటుచేసిన  'చదవడం మాకిష్టం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించారు. విద్యార్థుల్లో చదివే అభిరుచిని అలవాటు చేయడం, చదవులోని ఆనందాన్ని పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి స్కూల్‌లో గ్రంధాలయాలు ఏర్పాటు ద్వారా వి లవ్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పుస్తక పఠనం ద్వారా మనోవికాసం పెంచడం, జ్ఞానాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. 'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్ధుల భవిష్యత్తు బాగుంటుందని సీఎం ఆలోచించారని, 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్తామని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం విద్యా నామ సంవత్సరమేనని కొనియాడారు. చదవండి: పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అణుగుణంగా పాలన నడుస్తుందన్నారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, దీనిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్శిటీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి అయిదో తరగతిలో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు కేవలం క్లాసు పుస్తకాలనే కాకుండా అన్ని రకాల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అన్ని రకాల పుస్తకాలు చదివినప్పుడే విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వాటిని వారే పరిష్కరించుకో గలిగే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప వారు అవుతారని, విద్యకు పునాది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మానస పుత్రికల్లో విద్యా శాఖ ఒకటి అని తెలిపారు. చదవండి: అంబేద్కర్‌కి నివాళులర్పించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు