పావురం కలకలం.. కాలికి జియోట్యాగ్‌.. గూఢచర్యం కోసమేనా?

5 Jan, 2022 13:34 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్‌లో రబ్బరు ట్యాగ్‌తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్‌ట్యాగ్‌ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్‌ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్‌ ఉండటాన్ని గమనించాడు.

వెంటనే స్థానిక వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించాడు. వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. కాగా, గతంలో కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.  కేంద్రపడ జిల్లా మార్‌ సగై పీఎస్‌ పరిధిలో దశరథ్‌పుర్‌, పూరి జిల్లా హరికృష్ణాపూర్‌లోకూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి వీహెచ్‌ ఎఫ్‌ వైజాగ్‌ 19742021 ముద్రించి ఉన్నాయి.

గత సోమవారం పూరి జిల్లాలో లభించిన పావురం. ఒక పాదానికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం, మరో కాలికి 37 కోడ్‌ అంకెలతో కూడిన ట్యాగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.    

చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని..

మరిన్ని వార్తలు