ఆర్టీసీకి ఆక్సిజన్‌ వైఎస్‌ కుటుంబం

18 Nov, 2021 04:06 IST|Sakshi
మాట్లాడుతున్న చల్లా చంద్రయ్య

వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చల్లా చంద్రయ్య

తిరుపతి అర్బన్‌: వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించింది వైఎస్‌ కుటుంబమేనని ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. తిరుపతిలో బుధవారం వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. డిసెంబర్‌ 14న జరుగనున్న ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల్లో అసోసియేషన్‌ విజయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పారు. 1999లో అప్పటి నేతలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు.

అయితే 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న 27వేల మందిని ఆర్టీసీలో భాగస్వాములు చేశారని చెప్పారు. అదేవిధంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పోరాటం చేయకపోయినా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జోనల్, రీజనల్‌కు చెందిన లతారెడ్డి, టీవీ మురళీధరన్, అర్జున్, ఎంటీఆర్‌ రెడ్డి, రాంబాబు, పరంధామయ్య, మణితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిపో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు