వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లమాత్మక మార్పులు

1 Dec, 2020 16:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు నివర్‌ తుఫాన్‌ వల్ల కలిగిన పంట నష్ట్రంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మండలిలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇద్దరే ఇద్దరూ మహనీయులను చుశానన్నారు. ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరొకరు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలోని ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండాయన్నారు. తను రైతుగా అనేక తోటలు సాగు చేస్తున్నానని, ఒక రైతుగా ఇలాంటి ప్రభుత్వాన్ని తానేప్పుడు చూడలేదన్నారు.

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఆర్‌బీకే పరిశీలించడానికి కర్ణాటక నుంచి కర్నూలుకు అధికారులు వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో రాత్రి వేళ రైతులకు విద్యుత్‌ ఇవ్వడం వల్ల తన దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరూ చనిపొయారని చెప్పారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ఆయన చెప్పారు. టీడీపీ వాళ్లకు ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ లాంటి వారు కావాలని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు తమ ప్రభుత్వం మేమున్నామన్న భరోసా కల్పిస్తుందని చల్లా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు