Chandrababu Case October 1st Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

1 Oct, 2023 19:50 IST|Sakshi

క్వాష్‌ పిటిషన్‌పై 3న సుప్రీంకోర్టులో విచారణ

4న ఓటుకు కోట్లు కేసు విచారణ

అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసును బట్టబయలు చేసిన సిట్‌ దర్యాప్తు

పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు

రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో లోకేష్‌కు సీఐడీ నోటీసులు

41ఏ కింద నారా లోకేష్‌కు నోటీసులు

Updates..

7:45 PM
పవన్‌ వారాహి యాత్రకు అంబటి కౌంటర్‌

7:30 PM
లోకేష్‌, అచ్చెన్నాయుడు, యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్‌

5:40 PM
ఆశలన్నీ అక్టోబర్‌ 3 మీదే..
►అక్టోబర్‌ మూడో తేదీపై టీడీపీ కోటీ ఆశలు
►సుప్రీంకోర్టులో  కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్‌ నేతలతో సమాలోచనలు
► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు
►గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన

5:30 PM
రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. 
►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు
►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు 
►భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన సీఎం రమేష్ 
►రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రమేష్
►బీజేపీ పెద్దలతో ఎలాగైనా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని సూచన
►ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు

2:30 PM
శంషాబాద్‌లో టీటీడీపీ శ్రేణుల ఓవరాక్షన్‌..
►శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీటీడీపీ శ్రేణుల ఓవర్యాక్షన్
►చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రధాని వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో నిరసన
►ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
►చంద్రబాబును ప్రధాని మోదీ కాపాడాలంటూ బ్యానర్ ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
►చంద్రబాబు అరెస్టుపై ప్రధాని స్పందించాలని విజ్ఞప్తి

12:50PM
ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోండి: పేర్ని నాని

►చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్ని కన్నీళ్ల ఉసురు ఇదీ.. నీడల్లే వెంటాడుతోందీ.. అనే పాట గుర్తొస్తోంది
►కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని ఓట్లేయించుకుని తర్వాత మోసం చేశారు
►ముద్రగడ పద్మనాభం పిలుపుతో అప్పట్లో ఉద్యమం చేశారు
►కానీ నిన్నటి చంద్రబాబు ఉద్యమంలో అందరూ నవ్వుకుంటూ విజిల్స్ వేశారు
►అంటే చంద్రబాబు జైలుకు పోవటంపై ఆ పార్టీ వారికి కించిత్ కూడా బాధ లేదు
►చంద్రబాబు మీద అక్రమ కేసులు పెడితే కోర్టులు ఎందుకు జైలుకు పంపుతాయి? 
►ప్రజాసొమ్ము కైంకర్యం చేయకపోతే కోర్టులు ఎందుకు వదిలేయలేదు?
►లంచాలు తిని కంచాలు మోగించటం చూస్తుంటే.. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుంది
►టీడీపీకి కోటిమంది సభ్యత్వం ఉన్నట్టు చెప్పుకునేవారు
►మరి నిన్న ఎంతమంది గంట కొట్టారు?
►అంటే వారందరు కూడా చంద్రబాబు అవినీతి చేసినట్టు అనుకుంటున్నారు
►ఇప్పటికైనా ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోవాలి
►ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో వేస్తాం అని అప్పట్లో చంద్రబాబు అన్నారు

12:24PM
చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా ట్వీట్ నిర్వేదం
►ఇప్పటి వరకూ బాబు కేసులో లూథ్రాకు దొరకని బలమైన వాదం
►ఎంత సేపు సెక్షన్‌ 17a తప్ప మరో వాదన లేదు
►గవర్నర్ అనుమతి అడగలేదని అంటున్నారు,  కాని తప్పు చేయలేదని లూథ్రా చెప్పలేకపోతున్నారు
►జడ్జిలు త్వరగా తీర్పులు ఇవ్వడం ముఖ్యమన్న లూథ్రా
►ఓ కేసు విషయాన్ని ప్రస్తావించిన సిద్ధార్ధ లూథ్రా

11:50AM
►చంద్రబాబుకు పవన్‌ కొమ్ముకాయడం విడ్డూరం: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
►చంద్రబాబు నాయుడుకి జైల్లో దోమలు కుడుతున్నాయి అనడం హాస్యాస్పదం
►ప్రజల సొమ్ము 375 కోట్లు స్వయానా చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి స్కిల్ డెవలప్‌మెంట్‌ పేరుతో వెళ్ళాయన్న వాస్తవం సిఐడి స్పష్టం చేసింది
►దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను అవమానించిన ,అన్నని అవమానపాలు చేసిన చంద్రబాబు కోమ్ము కాయటం విడ్డూరం
►చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఎన్టీఆర్‌ దంపతులు స్వర్గంలో ఆనంద భాష్పాలు రాల్చుంటారు.

10:45AM
జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు

►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము 
►5 చానెల్ తో regular గా tv చూస్తున్న బాబు
►రాజమండ్రి జైల్లో 22వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు
►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బోజనము 
►వేడి నీళ్లు స్నానం
►ప్రతీ వారం ములాఖత్‌

10:31AM
సానుభూతి కోసం టిడిపి అష్ట కష్టాలు
►ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర?
►ఈ నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం
►అన్ని జిల్లాలను కవర్ చేసేలా భువనేశ్వరి బస్సు యాత్ర
►టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేలా భువనేశ్వరి యాత్ర

9:24AM
విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చే దుర్మార్గుడు నారాయణ: ఎమ్మెల్యే అనిల్‌
►సీఐడీ తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణ కి తెలుసు.
►చంద్రబాబు, నారాయణ విచారణకు సహజరించకుడదని మాట్లాడుకునేందుకు జైలులో బాబుకు కలిసారు
►స్టూడెంట్స్ తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు నారాయణ
►రూ. 800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడి వా..?
►నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు..
►టిడిపి నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడ కి చేసిన అన్యాయం గుర్తు వచ్చింది
►చంద్రబాబు చేసిన ద్రోహం టిడిపి నేతలకు కూడా కనిపిస్తుంది
►రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారు.
►ముద్రగడను , ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి. ఇబ్బందులు పెట్టిన విషయం టిడిపి నేతలకు గుర్తు లేదా..?
►లోకేష్ ఒక పులికేశి.. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టిడిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు
►సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీస్ లు ఇచ్చారు..

9.05AM
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నారా లోకేశ్ ట్వీట్
►4వ విడత వారాహి యాత్ర సక్సెస్ కావాలి..  జనసేనకు జైకొట్టాలి
►అవనిగడ్డలో జరగబోయే వారాహి యాత్ర బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి నడవాలని టీడీపీ శ్రేణులను కోరుతున్నా

8:29AM
తిరుమలలో టీడీపీ పచ్చ రాజకీయాలు.

►ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
►స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు అంటూ నిరసనలు
►టీడీపీ జెండాలతో శ్రీవారి ఆలయం వద్ద రాజకీయం
►తిరుమలలో స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ వీడియో రికార్డింగ్
►సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నం
►టీడీపీ తీరుపై మండిపడుతున్న హైందవ సంఘాలు, భక్తులు
►టీడీపీకి గుణపాఠం చెప్తామంటున్న శ్రీవారి భక్తులు

7:50AM
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై 3న సుప్రీంకోర్టులో విచారణ
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో క్రిమినల్‌ ఎస్‌ఎల్‌పీ దాఖలు
►3వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం
►ఈ ధర్మాసనం ముందు ఆఖరి ఐటెం నంబర్‌ 63గా రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు
►గత విచారణ సందర్భంగా చంద్రబాబు పిటిషన్‌ విచారణకు జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి నిరాకరించిన విషయం విదితమే.
►దీంతో ఈ పిటిషన్‌ జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. 

7:30AM
4న ఓటుకు కోట్లు కేసు విచారణ
►తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు.
►తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. 
►ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం
►ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు 
►ఈ పిటిషన్‌ను 4వ తేదీ నవిచారణ చేపట్టనున్న  జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం  

బాబు మాజీ పీఎస్‌ ‘పెండ్యాల’ సస్పెన్షన్‌
►మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్‌ వేటు.
►ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
►స్కిల్‌ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది.
►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ
►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల.
ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్వీస్‌ రూల్స్‌ను అతి­క్రమించడం కిందకు వస్తుంది.
►మరోవైపు.. శ్రీనివాసరావు  శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా నోటీసు పంపిన ప్రభుత్వం.
►అయితే, ఆయన రాకపోవడంతో సర్వీసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

2న భువనేశ్వరి నిరాహారదీక్ష
►నంద్యాల: చంద్రబాబు అరె­స్టుకు నిరసనగా అక్టోబర్‌ 2వ తేదీన ఆయన సతీమణి భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష
►టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ

 7:00AM
అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు
► అసైన్డ్‌ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు
►నారా , నారాయణ నల్లధనం నెట్‌వర్క్‌ బట్టబయలు
►అమరావతి­లోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్‌ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు
►ఎన్‌స్పైర నుంచి ఆర్కే హౌసింగ్‌కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు
►అసైన్డ్‌ రైతుల భూముల లూటీ
►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం
►అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసిన సిట్‌ దర్యాప్తు
►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు
►ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీవీ వియ్యంకుడు కూడా
►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ

6:40AM
అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు
♦నారా చంద్రబాబునాయుడు  (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి)
♦  నారా లోకేశ్‌  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ పొంగూరు నారాయణ  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  గంటా శ్రీనివాసరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  దేవినేని ఉమామహేశ్వరరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  ప్రత్తిపాటి పుల్లారావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  రావెల కిశోర్‌ బాబు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  తెనాలి శ్రావణ్‌ కుమార్‌  (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
♦  గుమ్మడి సురేశ్‌ (టీడీపీ ప్రభుత్వంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ  వెంకటేశ్వరరావు వియ్యంకుడు)
♦   మండల ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావు (రియల్టర్‌)
♦  మండల రాజేంద్ర (రియల్టర్‌)
♦  కేవీపీ అంజనీ కుమార్‌ (రియల్టర్‌)
♦  దేవినేని రమేశ్‌ (రియల్టర్‌)
♦  బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్‌ (రియల్టర్‌)
♦ హరేంద్రనాథ్‌ చౌదరి (రియల్టర్‌)
♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్‌)
♦ దోనేపూడి దుర్గా ప్రసాద్‌ (రియల్టర్‌)

6:35AM
నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు
♦ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో 41ఏ కింద నారా లోకేష్‌కు నోటీసులు
♦ఈ కేసులో ఏ14గా లోకేశ్‌
♦ఢిల్లీలో ఎంపీ జయదేవ్‌ ఇంట్లో అందజేసిన అధికారులు
♦4వ తేదీన తాడేపల్లి కార్యాలయంలో హాజరు కావాలి
♦హెరిటేజ్‌ ఫుడ్స్‌ బ్యాంకు ఖాతా, భూలావాదేవీల బోర్డు మినిట్స్‌ తేవాలి
♦విచారణకు సహకరించాలి.. నిబంధనలు పాటించకుంటే అరెస్టు తప్పదు
♦నోటీసుల్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు

మరిన్ని వార్తలు