తినడానికి తిండి దొరకదు

28 Jul, 2020 03:52 IST|Sakshi

కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది

ప్రతిపక్ష నేత చంద్రబాబు 

సాక్షి, అమరావతి: కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తినడానికి తిండిలేని పరిస్థితి వస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. నిత్యావసర వస్తువులకు కూడా విధిలేని పరిస్థితి వస్తుందన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఆయన రాష్ట్రంలోని పార్టీ నేతలు, కార్యర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే.. 

► ఆర్థికంగా ప్రపంచం మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది.  కరోనా వ్యాప్తిలో ఇండియా మూడో స్థానంలో ఉంటే ఇండియాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోగులు చనిపోతున్నారు. ఎక్కువ మందికి కరోనా వైరస్‌ వస్తోంది. ఇది బాధాకరం. 
► మనపై ఎదురుదాడి చేయడానికి సమయం ఉపయోగించారు. ఎవరూ అధైర్యపడవద్దు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను గౌరవిద్దాం.. వారికి అండగా నిలబడాలి. 

మరిన్ని వార్తలు