చంద్రబాబు అండతోనే..

24 Apr, 2021 04:40 IST|Sakshi
డెయిరీ భూముల్లో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభిస్తున్న చంద్రబాబు, పక్కన నరేంద్ర (ఫైల్‌)

సాక్షి, గుంటూరు: పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన సహకార రంగంలోని సంగం డెయిరీని చంద్రబాబు హయాంలో ధూళిపాళ్ల నరేంద్ర కంపెనీ చట్టంలోకి అక్రమంగా మార్చారు. డెయిరీ చైర్మన్‌గా చలామణి అవుతూ పాడి రైతులను నిలువుదోపిడీ చేశారు. కడుపు మండిన పాడి రైతులు న్యాయ పోరాటానికి దిగితే వారిని వేధించారు. చంద్రబాబు అండదండలతో పేట్రేగిపోయా రు. డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడం, తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్టుకు బదలాయించడం, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణాలు పొందడం వంటి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు.

ట్రస్ట్‌ పేరుతో డెయిరీ ఆస్తుల దోపిడీ..
1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టుకు సంగం డెయిరీకి చెందిన పదెకరాలను నిబంధన లకు విరుద్ధంగా బదలాయించారు. ఆ భూమిలో వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఆస్పత్రి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరు గుతోందని 2016లో తొమ్మిదిమంది పాడి రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రి నిర్మాణం నిలిపివేయాలని న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో సంగం డెయిరీ పాడి రైతుల ప్రయోజ నాల కోసం నిర్మాణాలు చేపడతానని కోర్టులో నరేంద్ర అఫిడవిట్‌ దాఖలు చేశారు. స్టే కొనసాగు తుండగానే ఆస్పత్రి భవనాన్ని 2018 ఆగస్టు 28న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

బోనస్‌లోనూ మాయే
ఏటా పాడి రైతులకు లీటరుకు బోనస్‌ ప్రకటిస్తారు. ప్రకటించిన బోనస్‌ సొమ్మును రైతులకు అందజేయడంలోనూ బడా స్కామ్‌ జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ బోనస్‌ పంపకాలపై విచారణ జరిగితే భారీ స్కామ్‌ బయటపడనుంది.  

మరిన్ని వార్తలు