కత్తి తీసి పోరాడటమే సరైనది.. చంద్రబాబు లాయర్‌ ఆసక్తికర ట్వీట్‌

14 Sep, 2023 08:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ కుంభకో­ణంలో అరెస్ట్‌ అయిన చంద్ర­బాబు నాయుడు తరఫున వాది­స్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. హైకోర్టు బుధవారం క్వాష్‌ పిటిషన్‌ను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం.. ఈ రోజు మా నినాదం ఇదే.. అంటూ గురు గోవింద్‌ సింగ్‌ సూక్తిని ఆయన ఉటంకించారు. ‘అన్ని విధా­లుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరా­డ­టమే సరైనది’ అని ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.

చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: బాబు భద్రతపై మరింత శ్రద్ధ

మరిన్ని వార్తలు