Oct 16th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

16 Oct, 2023 21:15 IST|Sakshi

అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో విచారణ నవంబర్‌ 1వ తేదీకి వాయిదా

కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్‌ చేయాలని సీఐడీ మరో పిటిషన్‌

సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు

కేసు రీ ఓపెన్‌ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు

కేసుల్లో పీకల్లోతులో మునిగిపోయిన చంద్రబాబు

స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు.. అన్నీ కేసుల్లో పక్కాగా ఆధారాలు

40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంత గుడ్డిగా ఎలా సంతకాలు చేశారని పార్టీలో వాదనలు

చంద్రబాబు కేసుల్లో వాదించేందుకు ఏమి లేక 17a సవరణను పట్టుకు వేలాడుతున్న లాయర్లు

ఇప్పటివరకు అన్ని కోర్టుల్లో బాబు లాయర్ల ఏకైక వాదన అరెస్ట్ కు అనుమతి లేదని మాత్రమే..!

చంద్రబాబు తప్పు చేయలేదన్న వాదనలు ఎందుకు కోర్టు ముందు చెప్పడం లేదు.?

సుప్రీంకోర్టులో మంగళవారం జరుగనున్న విచారణపై కోటి ఆశలు

Chandrababu Case : Legal and Political Updates

08:49PM, అక్టోబర్‌ 16, 2023
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం
► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ
► 36 లక్షల డిజిటల్‌ సంతకాలు సేకరించామంటూ ప్రచారం
► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు
► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత
► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి?
► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా?
► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా?
► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా?
► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్‌ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు?
► కేవలం అరెస్ట్‌ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు?
► రేపు కేసు బెంచ్‌ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు?
► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది? 
► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా?

06:49PM, అక్టోబర్‌ 16, 2023
ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల మరో పిటిషన్‌
►చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇవ్వాలంటూ పిటిషన్‌
►ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ వేసిన చంద్రబాబు లాయర్లు
►వైద్యులు రిపోర్ట్స్‌ ఇవ్వడానికి నిరాకరించారన్న బాబు లాయర్లు
►అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్ట్‌లు మెయిల్స్‌లో వచ్చాయన్న జడ్జి
►కాపీ అందిన తర్వాత ఇస్తామని బాబు లాయర్లకు తెలిపిన జడ్జి 

06:05PM, అక్టోబర్‌ 16, 2023
ముగిసిన కిలారు రాజేష్‌ విచారణ.. రేపు మళ్లీ
►స్కిల్‌ స్కామ్‌ కేసులో నారా లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ విచారణ
►టీడీపీ నేతను ఏడు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ అధికారులు
►పాతిక దాకా ప్రశ్నలు సంధించినా.. తెలియదనే సమాధానాలు
►మౌనం.. దాటవేత ధోరణి ప్రదర్శన
►చివరకు లోకేష్‌తో పరిచయం కూడా గుర్తు లేదని బుకాయింపు
►ఆధారాలను సీఐడీ అధికారులు ముందు పెట్టడంతో నీళ్లు నమిలిన కిలారు రాజేష్‌
►మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని తెలియదంటే.. వాట్సాప్‌ ఛాటింగ్‌, నగదు ట్రాన్‌జాక్షన్స్‌ ముందు పెట్టిన అధికారులు
►చివరకు.. చంద్రబాబు, లోకేష్‌తో జరిగిన మెయిల్స్‌ సంభాషణపైనా అడ్డంగా దొరికిపోయిన వైనం
►రేపు(మంగళవారం, అక్టోబర్‌ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను కోరిన సీఐడీ

05:55PM, అక్టోబర్‌ 16, 2023
చంద్రబాబు అరెస్ట్‌కు జనం రియాక్షన్‌ అందుకే లేదు
►చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ వాళ్లే చెప్పడం లేదు
►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు
►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు
►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది
►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు
►తమ పని తాము చేసుకుంటున్నారు
►టీడీపీ నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు
►ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు
►నాయకుడు కోసం ప్రజల స్వచ్ఛందంగా రోడ్లపైకి రావాలి
:::ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

05:13PM, అక్టోబర్‌ 16, 2023
సుప్రీంలో రేపు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్
►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం  
►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు 
►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు  నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

05:08PM, అక్టోబర్‌ 16, 2023
స్కిల్‌ స్కామ్‌ కేసులో కొనసాగుతున్న కిలారు రాజేష్‌ విచారణ
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ నేత, నారా లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ
►కిలారు రాజేష్‌ను 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ 
►మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానితో సంబంధాలపై రాజేష్‌కు ప్రశ్నలు
►పార్థసాని ఎవరో తెలియదన్న కిలారు రాజేష్‌
►వాట్సాప్‌ చాటింగ్‌, నగదు ట్రాన్‌జాక్షన్స్‌ వివరాలను రాజేశ్‌ ముందుంచిన సీఐడీ

04:48PM, అక్టోబర్‌ 16, 2023
సుప్రీంలో రేపు చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం 
►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది 
►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు 
►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం 
►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం
►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం

03:56PM, అక్టోబర్‌ 16, 2023
ఢిల్లీకి మళ్లీ లోకేష్ బాబు 
►మళ్లీ ఢిల్లీ బాట పట్టిన టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ బాబు
►చంద్రబాబు కేసుల్లో రేపు కీలక పరిణామం
► సుప్రీంకోర్టులో మం‍గళవారం బాబు పిటిషన్లపై విచారణ
►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌
► మరోవైపు స్కిల్‌ స్కాం కేసులో క్వాష్‌ పిటిషన్‌పైనా విచారణ
►విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం
►సీనియర్ లాయర్‌లతో సంప్రదింపులు జరపనున్న లోకేష్ 
►చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ లాయర్లు హరీష్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా

03:32PM, అక్టోబర్‌ 16, 2023
తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి ఫోకస్‌?
►నారా భువనేశ్వరి నుంచి మాజీ ఎమ్మెల్యే , టీటీడీపీ సీనియర్ నేత నర్సింహులుకు అత్యవసర పిలుపు
►హుటాహుటిన రాజమండ్రి బయల్దేరిన బక్కని నర్సింహులు
► తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి దృష్టిసారించడంపై సర్వత్రా చర్చ
►బాలయ్య నుంచి నారా కుటుంబం అది కూడా లాగేసుకుంటుందనే టాక్‌

03:29PM, అక్టోబర్‌ 16, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
►ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
►విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన ఏపి హైకోర్టు
►అప్పటివరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగింపు 
►ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ ‌పై కూడా అప్పటివరకు విచారించవద్దని ఆదేశాలు
►ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిఐడీ

03:28PM, అక్టోబర్‌ 16, 2023
అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ

►అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ
►కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సిఐడీ మరో పిటిషన్
►సీఐడీ అధికారుల వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
►సీఐడీ   అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు
►హైకోర్టుకు ఆడియో ఫైల్స్‌ను అందించిన సిఐడీ తరపు న్యాయవాదులు
►రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందింస్తామన్న సీఐడీ
►సీఐడీ పిటిషన్ విచారణపై అభ్యంతరం తెలిపిన నారాయణ తరపు లాయర్లు
►తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్న నారాయణ తరపు లాయర్లు
►వేరే కేసులోని ఆధారాలు ఈకేసులో ఎలా దాఖలు చేస్తారన్న నారాయణ తరపు లాయర్లు
►కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న హైకోర్టు
►విచారణ వచ్చేనెల 1కి వాయిదా వేసిన హైకోర్టు

03:11PM, అక్టోబర్‌ 16, 2023
నారాయణ భార్య పిటిషన్‌ డిస్పోజ్‌
 
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ మంత్రి నారాయణ భార్య పిటిషన్‌
►రమాదేవితో పాటు నారాయణ బావమరిది రావూరి సాంబశివరావు కూడా పిటిషన్‌
►నారాయణ బినామీ ప్రమీల కూడా ముందస్తు కోసం పిటిషన్‌ 
►హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ
►41A నోటీసులు ఇచ్చామని న్యాయస్థానానికి చెప్పిన సీఐడీ తరపు లాయర్లు
►మూడు పిటిషన్లు డిస్పోస్ చేసిన హైకోర్టు

03:10PM, అక్టోబర్‌ 16, 2023
చంద్రబాబుకి ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి

►మాకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లు తెలుగుదేశం పిలుపునిస్తోంది 
►టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి ప్రజలనుండి స్పందన కరువైంది
►24 గంటల్లో ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు
►ఆ కార్యక్రమం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు
►చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 నెంబర్ ద్వారా కోర్టు పరిధిలో ఉన్నాడు
►చంద్రబాబు ఆరోగ్యం పై అనుమానం ఉంటే కోర్టుకి తెలియజేయండి
►కోర్టు పరిధిలోకి వెళ్ళినాక ప్రభుత్వం ఏమి చేయలేదు
►ఖైదీకి ఏ సదుపాయాలు ఉంటాయో చంద్రబాబుకి అవే ఉంటాయి
►చంద్రబాబుకి ప్రైవేటు వైద్యం కావాలని పవన్ కళ్యాణ్ ఎందుకు కోర్టుని అడగట్లేదు
►పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో ఫామ్ హౌస్ లో బిజీగా ఉంటాడు
►చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు 
►చంద్రబాబు ఎప్పుడు పోతాడా టిడిపిని జనసేనలో కలుపుకుందామని పవన్ తాపత్రయ పడుతున్నాడు
►అంతేగాని చంద్రబాబు మీద పవన్ కి ప్రేమ లేదు
►టీడీపీ వాళ్ళని చూసి వాళ్ళ కేడరే నవ్వుకుంటుంది
►చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదు.. తప్పుమనిషి
►30 రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడింది
►చంద్రబాబుకి లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు
►చంద్రబాబు రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కావు
►చంద్రబాబు ఇంకా దేనికీ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారు
:::మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు       

12:59PM, అక్టోబర్‌ 16, 2023
►ఇన్నర్‌రింగ్‌రోడ్‌ స్కామ్‌ కేసులో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఎల్లుండి(బుధవారం)కి వాయిదా వేసిన హైకోర్టు
►500 పేజీల కౌంటర్‌ దాఖలు చేసిన సీఐడీ

12:54PM, అక్టోబర్‌ 16, 2023
►తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉంది : కాసాని జ్ఞానేశ్వర్
►బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు 
►80 మంది అభ్యర్ధులను నిలబెట్టాలనుకుంటున్నాం
►అన్నీ చోట్ల బాలకృష్ణ ప్రచారం చేస్తారు

12:49PM, అక్టోబర్‌ 16, 2023
రాజమండ్రి 

►హెల్త్ రిపోర్ట్స్ నివేదిక అడిగిన చంద్రబాబు లాయర్లు
►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చేందుకు నిరాకరించిన జైలు అధికారులు
►హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు సబ్మిట్ చేశాం
►అవసరమైతే కోర్టు నుంచి తీసుకోవాలన్న జైలు అధికారులు

12:05 PM, అక్టోబర్‌ 16, 2023
నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా?

► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా?
► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు?
► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా?
► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు?
► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు?
► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా?
► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా?
► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు?
► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా?
► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు?
► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు? 
► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు?

11:55AM, అక్టోబర్‌ 16, 2023
నవంబర్ లో నారాయణ పిటిషన్ 

►అసైన్డ్‌ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ నవంబర్‌1కి వాయిదా

11:50AM, అక్టోబర్‌ 16, 2023
రింగ్ రోడ్ మాయ  కేసులో బెయిల్ పిటిషన్లు

► ఇన్నర్‌ రింగ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ మధ్యాహ్నం గం. 2.15కి వాయిదా
►ఏపీ హైకోర్టులో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబ శివరావు,నారాయణ బినామీ ప్రమీల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..  

11:20 AM, అక్టోబర్‌ 16, 2023
చంద్రబాబుకు మరో షాక్‌
►అమరావతి అసైన్డ్‌ ల్యాండ్‌ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ
►ఈ కేసులో ఇప్పటికే పూర్తైన విచారణ
►నేడు తీర్పునిచ్చేందుకు సిద్దమైన కోర్టు
►ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్‌ వేసిన సీఐడీ
►సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
►కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌
►కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ
►రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ 
►కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్‌ చేయాలని సీఐడీ మరో పిటిషన్‌
►సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు. 
►కేసు రీ ఓపెన్‌ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు 
►విచారణ నవంబర్‌ 1వ తేదీకి వాయిదా. 

11:10 AM, అక్టోబర్‌ 16, 2023
CID విచారణకు కిలారు రాజేష్‌
►స్కిల్‌ స్కాంలో విచారణకు హాజరైన కిలారు రాజేష్‌
►సిట్‌ కార్యాలయంలో కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ
►ఇన్నర్‌ రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్‌ కుంభకోణాల్లో రాజేష్‌ కీలక పాత్రధారి
►అక్రమంగా నిధుల తరలింపులోనూ రాజేశం కీలకం
►నారా లోకేశ్‌కు రాజేష్‌ అత్యంత సన్నిహితుడు
►లోకేశ్‌ యువగళం పాదయాత్రలో రాజేష్‌ కీలక పాత్ర.

10:30 AM, అక్టోబర్‌ 16, 2023
ఎల్లో బ్యాచ్‌ ఓవరాక్షన్‌..
►చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు.
►రోడ్లపై బ్యాండ్‌ మేళం డ్రెస్సులు వేసుకుని ఓవరాక్షన్‌
►వీడియోలపై నెటిజన్లు సెటైరికల్‌ కామెంట్స్‌.

9:10 AM, అక్టోబర్‌ 16, 2023
లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా?
► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు
► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు
► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన
► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు
► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు

1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ
► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ
► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా?

2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని
► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం
► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం
► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం

3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
► పెనమలూరులో  ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్
► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు
► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం
► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం

4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు
► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు
► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన
► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం 

► సమన్వయ కమిటీ సభ్యులకు ముందే సూచనలు
► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్

8:50 AM, అక్టోబర్‌ 16, 2023
రాజమండ్రి నుంచి చంద్రబాబు హెల్త్ బులెటిన్
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు
► నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
► ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు టవర్ ఏసీ ఏర్పాటు
► BP 140/80
► పల్స్..70/మినిట్
► రెస్పిరేటరీ రేటు...12/మినిట్
► SPO2 - 96%
► బరువు 67కేజీలు
► ఫిజికల్ యాక్టివిటీ... గుడ్

8:40 AM, అక్టోబర్‌ 16, 2023
నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
► చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
► స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

8:30 AM, అక్టోబర్‌ 16, 2023
నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ 
► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
► అసైన్డ్ భూముల కోసం జీవో41 కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకొచ్చారని చంద్రబాబు, నారాయణపై సీఐడీ మోపిన కేసులపై తీర్పు
► ఐఆర్ఆర్ కేసులో నారాయణ భార్య రమాదేవి, సాంబశివరావు, ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో విచారణ
► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్
► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసులను క్వాష్ చేయాలని నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ

8:00 AM, అక్టోబర్‌ 16, 2023
చంద్రబాబు రాజమండ్రి జైలులో @37వరోజు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 37వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసిన జైలు అధికారులు
►చంద్రబాబు ఆరోగ్యం స్థిరంగా ఉందంటూ మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు
►చర్మ సంబంధిత సమస్య మినహా చంద్రబాబుకు మరే రకమైన ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేసిన వైద్యుల బృందం

7:42AM, అక్టోబర్‌ 16, 2023
►అసైన్డ్ భూముల కేసులో నేడు ఏపీ హైకోర్టు తీర్పు
►అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని కేసు
►ఇప్పటికే హైకోర్టులో ముగిసిన విచారణ, నేడు తీర్పు
►కేసు రీ ఓపెన్ చేయాలని సీఐడీ రెండు పిటిషన్లు

7:05 AM, అక్టోబర్‌ 16, 2023
అడ్డంగా బుక్కైన చంద్రబాబు..
►స్కిల్‌ స్కామ్‌ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు
►‘సెక్షన్‌ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు బెడిసికొట్టిన ప్లాన్‌ 
►ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీకి షాక్‌
►టీడీపీకి కేంద్ర జీఎస్టీ విభాగం లేఖతో ఎదురుదెబ్బ
►టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్‌ స్కామ్‌ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం
►జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది. 

7:00 AM, అక్టోబర్‌ 16, 2023
2017లోనే కేసు నమోదు.. 
►చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్‌ విభాగం చిత్తు చేసింది.
►కేంద్ర జీఎస్టీ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. 
►స్కిల్‌ స్కామ్‌ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. 
►దీంతో, చంద్రబాబుకు సెక్షన్‌ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. 
►2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్‌ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది.

07:10PM, అక్టోబర్‌ 15, 2023
►టీడీపీకి మరోసారి షాక్‌  ఇచ్చిన ప్రజలు
►అట్టర్‌ ఫ్లాప్‌ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం
►లోకేశ్‌ పలుపును పట్టించుకోని జనం
►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం
►ప్రజల నుంచి కరువైన స్పందన.

చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా?
► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్‌ ప్రయత్నించారు : ఎల్లో మీడియా
► కారణం తెలియదు గానీ అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌  నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా
► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు : ఎల్లో మీడియా
► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా
► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు
► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం
► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714  (మే 3,  2021 ) 
► ఇక్కడ మొత్తం పోల్ అయిన  ఓట్లు -1 .91  లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం  లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?


వెంటాడుతున్న అమరావతి పాపం
► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం
► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు
► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు


పొత్తులో ఎవరి వాటా ఎంత? 
► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ
► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య
► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ
► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ
► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి?
► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత
► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు?
► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్
► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్
► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి
► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్
► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి
► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు
► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్
► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు
► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు
► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు

మరిన్ని వార్తలు