బాబు జీవితమంతా 420 పనులే.. ఫ్యాన్‌ గాలికి ఆ ఇద్దరూ విలవిల: మంత్రి రోజా

28 May, 2022 11:42 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేష్‌ పిచ్చెక్కి తిరుగుతున్నారని..

సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఫొటోకి దండం పెడుతున్నారని, మహానాడులో అయినా ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని మంత్రి రోజా డిమాండ్‌ చేశారు. 

మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. కానీ, సీఎం జగన్‌ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు. మా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలూ లబ్ధి పొందుతున్నారు. 95 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారు. 

అయితే మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ఆమె ఎద్దేశా చేశారు. ఫ్యాన్‌ గాలి(వైఎస్సార్‌సీపీని ఉద్దేశిస్తూ..) దెబ్బకు చంద్రబాబు, లోకేష్‌ పిచ్చెక్కి తిరుగుతున్నారని అన్నారు. మంచి చేశాం కాబట్టే.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం అన్న మంత్రి రోజా.. అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన ఎందుకు డిమాండ్‌ చేశాయని ప్రశ్నించారు.  
 

మరిన్ని వార్తలు