జిల్లా ఎంపిక క‌మిటీలో ప్ర‌భుత్వం మార్పులు

25 Aug, 2020 19:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ‌చ్చే నెల 20 నుంచి స‌చివాల‌య ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షించే జిల్లా ఎంపిక కమిటీలో ప్ర‌భుత్వం మార్పులు చేసింది. వివిధ శాఖల ఉన్నతాధికారులను జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నూతనంగా బాధ్యతలు అప్పగించిన జాయింట్ కలెక్టర్లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ,వార్డు సచివాలయ జేసీలతో పాటు రైతు భరోసా, రెవెన్యూ జేసీలను కూడా జిల్లా ఎంపిక‌ కమిటీలో నియమిస్తున్న‌ట్లు పేర్కొంది. సంక్షేమ బాధ్యతలు చూసే మరో జేసీని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించింది. (చ‌ద‌వండి: సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ)

(చ‌ద‌వండి: ‘చేయూత’తో స్వయం సమృద్ధి)

మరిన్ని వార్తలు