కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు

10 Sep, 2020 20:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి(శుక్రవారం) భక్తులకు అమ్మవారి దర్శనం సమయం ఉదయం 06.గంటల నుంచి రాత్రి 08.గంటల వరకు లయ అధికారులు పెంచారు. (వైఎస్‌ జగన్‌ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి)

కరోనా ప్రారంభం నుంచి దుర్గగుడిలో భక్తులు అమ్మవారి సేవల్లో ప్రత్యక్షం పాల్గొనే అవకాశం నిపిలివేశారు. రేపటి నుంచి భక్తులు ప్రతిరోజు సాయంత్రం 06.గంలకు జరుగనున్న అమ్మవారి పంచహారతులు సేవలో పరిమిత సంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అమ్మవారి సేవల టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org , మొబైల్ ఆప్ kanakadurgamma, అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా భక్తులు అమ్మవారి సేవ టికెట్స్  పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. (20 శాతం మందికి వైరస్‌ వచ్చి పోయింది)

మరిన్ని వార్తలు