అనంతపురంలో పేలుడు.. ముక్కలైన వ్యక్తి శరీరం

7 Apr, 2023 15:02 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  అనంతపురం నగరంలో పేలుడు కలకలం రేపుతోంది. ఊహించని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని బాలాజీ స్టిక్కర్‌ అండ్‌ స్ప్రే పేయింట్‌ షాపులో కెమికల్‌ పెయింట్‌ డబ్బా ఓపెన్‌ చేస్తుండగా పేలుడు సంభవించింది. 

ఒక్కసారిగా పెయింట్‌ బాక్స్‌ పేలడంతో  సతీష్‌ అనే వాచ్‌మెన్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కాగా పేలిన పెయింట్‌ డబ్బా పదేళ్ల క్రితం నాటిదని తేలుస్తోంది.

మరిన్ని వార్తలు