పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్‌జీటీ ధర్మాసనం విచారణ

27 Aug, 2021 15:47 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లను చెన్నై ఎన్‌జీటీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని దాఖలైన పిటిషన్లలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ నోడల్‌ ఏజెన్సీగా తెలంగాణ మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ఎన్‌జీటీ తొలగించింది. కమిటీ నోడల్‌ ఏజెన్సీగా కేఆర్‌ఎంబీని ఎన్‌జీటీ నియమించింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!

మరిన్ని వార్తలు