గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

15 May, 2022 13:12 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు.
తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్‌’.. ఎక్కడంటే?

మరిన్ని వార్తలు