ఏపీలోని 4 కళాశాలలకు ఛాత్ర విశ్వకర్మ అవార్డులు

6 Sep, 2021 08:56 IST|Sakshi

అవార్డులందజేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏటా అందించే ‘ఛాత్ర విశ్వకర్మ అవార్డీ స్టూ డెంట్స్‌ ప్రాజెక్ట్స్, ఇట్స్‌ అప్లికేషన్‌ ఫర్‌ సొసైటీ’ అవా ర్డులు ఏపీలోని నాలుగు కళాశాలల విద్యార్థులకు దక్కాయి. పరిశుభ్రత విభాగంలో దక్షిణ మధ్య వర్సిటీల్లో ఏపీకి చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ)కి ‘ద క్లీన్, స్మార్ట్‌ క్యాంపస్‌(ఐకేఎస్‌)’అవార్డు దక్కింది. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ విజేతల ప్రతినిధులకు అవార్డు అందజేశారు.

ఏపీలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్‌ కాలేజ్‌కు చెందిన ‘శ్రామిక్స్‌’బృందానికి రీసైక్లింగ్‌ ఆర్‌ అప్‌ స్కిల్లింగ్‌ ఫర్‌ ఎ న్య్సూరింగ్‌ లైవ్లీహుడ్‌ విభాగంలో తొలిస్థానం దక్కింది. ఆదిత్య ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మేనేజ్‌ మెంట్‌కు చెందిన ‘ఛాలెంజర్స్‌’ బృందానికి ఐఓటీ –బేస్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ డివైజ్‌కు ‘జెండర్‌–రెస్పాన్సివ్‌ మెకానిజం టు కాంబాట్‌ డొమెస్టిక్‌ వయెలెన్స్‌’ విభాగంలో రెండోస్థానం దక్కింది. విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ‘బ్లూ లియో’ బృందానికి స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో మూడో ర్యాంకు దక్కింది. ఆదిశంకర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన ‘షాహుల్‌’బృందానికి బారియర్స్‌ ఇన్‌ యాక్సెసింగ్‌ అడక్వెట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ విభాగంలో మూడో స్థానం దక్కింది. విశ్వేశ్వరయ్య, డాక్టర్‌ ప్రీతమ్‌ సింగ్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు 2021ను కూడా ప్రదానం చేశారు.

ఇవీ చదవండి:
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు  
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..

మరిన్ని వార్తలు