రైతు పక్షపాతి సీఎం జగన్‌

27 Jun, 2022 13:56 IST|Sakshi

పెనుకొండ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఎమ్మెల్యే అధ్యక్షతన వైఎసార్‌సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. నియోజకవర్గ పరిశీలకుడు మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీంఅహ్మద్‌ హాజరయ్యారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు రాయితీతో నాణ్యమైన  విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు గిట్టుబాటు ధరతో పంటలు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమాతో రైతులను ఆదుకుంటున్నారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎన్నికల హామీలు అమలు చేశారన్నారు.

పెనుకొండకు మెడికల్, నర్సింగ్‌ కళాశాల మంజూరు చేశారని, ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదన్నారు. ఆరోగ్యశ్రీ కింద 2400 జబ్బులను చేర్చి వైద్యాన్ని పేదలకు మరింత దగ్గర చేశారన్నారు. వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1.45 లక్షల కోట్లు, పెనుకొండ నియోజకవర్గంలో రూ.835 కోట్లు జమ చేశారన్నారు.  జగనన్న కేబినెట్‌తోపాటు స్థానిక సంస్థల పదవుల్లో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏకపక్ష గెలుపే జగనన్న పాలనకు నిదర్శమన్నారు.  వచ్చే ఎన్నికల్లో జగనన్న మరోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. 

విమర్శించడమే టీడీపీ పని.. 
సంక్షేమ పథకాల ద్వారా జగనన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నా టీడీపీ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. పచ్చమీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంతోపాటు ఆయన హయాంలో ప్రతి పథకంలోనూ ప్రజల సొమ్మును దోపిడీ చేశారన్నారు. దీంతో ప్రజలు ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.  

ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ధీరుడని, ఇంత వరకు ఇలాంటి నాయకుడిని దేశంలోనే చూడలేదని నియోజకవర్గ పరిశీలకుడు నర్సేగౌడ పేర్కొన్నారు. వాల్మీకులను ఇతర కులాలను ఎస్టీ, ఓబీసీల్లో చేర్చే విషయమై సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.  ప్లీనరీకి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడం గొప్ప విషయమన్నారు.  

చంద్రబాబు అవకాశవాది.. 
చంద్రబాబు  అవకాశవాది అని, ఆయన పాలన∙చీకటిమయమని ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు.  రానున్న ఎన్నికల్లో పెనుకొండలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరులు మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున,  మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ పైడేటి రమణ, కన్వీనర్లు నాగలూరుబాబు, నారాయణరెడ్డి, తిమ్మయ్య, బీకే.నరసింహమూర్తి, లక్ష్మీనరసప్ప, తయూబ్, ఎంపీపీలు గీత, గంగమ్మ, ప్రమీల, సవిత, చంద్రశేఖర్, జెడ్పీటీసీలు గుట్టూరు శ్రీరాములు, డీసీ అశోక్, జయరాంనాయక్, పరిగి శ్రీరాములు, ఏడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ శంకరరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ ఉమర్‌ఫారూఖ్‌ఖాన్, వైస్‌ చైర్మన్లు నందిని, సునీల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి, సంగీత,నృత్య అకాడమీ డైరెక్టర్‌ సువర్ణ, సర్పంచ్‌లు నాగమూర్తి, అశ్వత్థప్ప, సింగిల్‌విండో  మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకరరెడ్డి, గుట్టూరు ఆంజనేయులు, ప్రభాకర్, గోరంట్ల మార్కెట్‌యార్డు చైర్మన్‌ బూదిలి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..)

మరిన్ని వార్తలు