తెనాలిలో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం

23 Feb, 2023 05:39 IST|Sakshi
పోక్సో కోర్టును ప్రారంభించిన జస్టిస్‌ దుర్గాప్రసాదరావు. జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ కృష్ణమోహన్, జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ సుజాత తదితరులు

పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు 

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.కృష్ణమోహన్, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ వడ్డిబోయిన సుజాత, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు.

జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభు­త్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు.

పోక్సో నేరాలను తీవ్రమైనవి­గా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సం­కల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కో­ర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మ­రో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ 
చేస్తారని చెప్పారు.   

మరిన్ని వార్తలు