ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

16 May, 2022 23:48 IST|Sakshi
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న నాయకులు, అధికారులు, గుడిపాలలో అన్నదానం 

చిత్తూరు రూరల్‌/చిత్తూరు అగ్రికల్చర్‌/గుడిపాల: చిత్తూరు, గుడిపాల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలను మండల ప్రజాప్రతినిధులతోపాటు వెఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికారులు ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిసి దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

గుడిపాలలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ఎస్‌ బాబునాయుడు, వైస్‌ ఎంపీపీలు జయరాం, రంజనీ, గుడిపాల ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, నాయకులు త్యాగరాజులు, సంపత్, బాబు, దిలీప్, కుమార్, ధర్మారెడ్డి, ఎంపీటీసీ, సర్పంచులు  ప్రతిమారెడ్డి,  భాస్కర్‌రెడ్డి, భాస్కర్,  శ్రీధర్‌రెడ్డి, రజనీకాంత్, వెంకటేష్‌రెడ్డి, కలై అరసి, రవీంద్రారెడ్డి, శ్రీరాములురెడ్డి, జనార్ధన్, ప్రసాద్‌రెడ్డి, చిట్టిబాబు, డానియల్, విక్టర్, సాయిప్రతాప్, శింభు, సాయి, గోపి, క్రిష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు