శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా..

17 Nov, 2021 11:13 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు.  బుధవారం(నవంబర్‌ 17)తన.. జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆర్కే రోజా తెలిపారు.

ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక ఆశీర్వాచనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. 

మరిన్ని వార్తలు