Civils Prilimanary Exam: నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష

10 Oct, 2021 07:52 IST|Sakshi

సాక్షి, తిరుపతి: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి తిరుపతిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,201 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. 
 
ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. 

తెలంగాణ...
తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లో 101 పరీక్ష కేంద్రాల్లో 46,953 మంది, వరంగల్‌లో 14 కేంద్రాల్లో 6,062 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణ బస్ భవన్ ప్రెస్ నోట్
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్‌ఆర్‌టీసీ నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్‌లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్‌ సివిల్ సర్వీస్ పరీక్ష -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్‌టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు.  
 

మరిన్ని వార్తలు