సీజేఐకి గవర్నర్‌ తేనీటి విందు 

27 Dec, 2021 03:38 IST|Sakshi
రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్‌ రమణ, శివమాల దంపతులకు గవర్నర్‌ హరిచందన్‌ ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్, సతీమణి వైఎస్‌ భారతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, ఏపీ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తదితరులు

సీఎం జగన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే హాజరు

సాక్షి, అమరావతి:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గౌరవార్థం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులను గవర్నర్‌ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు ప్రధాన న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. అప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఎదురేగి స్వాగతం పలికి దర్బార్‌ హాల్‌లోకి తోడ్కొని వచ్చారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులతో తేనీటి విందులో సతీ సమేతంగా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయిన సీజేఐ కాసేపు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ విందు సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సుప్రవ హరిచందన్‌ దంపతులు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందించారు.

గవర్నర్‌తో సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీకే మిశ్రా, సీఎం వైఎస్‌ జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాలను కూడా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఉన్నతాధికారులు ప్రవీణ్‌ప్రకాశ్, ధనుంజయ్‌రెడ్డి, ముత్యాల రాజు, కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె. నివాస్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

మరిన్ని వార్తలు