Vijayawada: కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న హైకోర్టు సీజే, సీఎం జగన్‌

20 Aug, 2022 10:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. 

విజయవాడ కోర్టుతో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు. 

ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొంటారు.

ఇదీ చదవండి: పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు

>
మరిన్ని వార్తలు