ట్రాక్టర్‌ బోల్తా ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా

5 Jun, 2023 20:49 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లా ట్రాక్టర్‌ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్‌.  అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 25వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు.

ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు చనిపోయిన సంగతి తెలిసిందే.  వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి  ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి. సుహొసినిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు