ఏపీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఆ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా..

28 Sep, 2022 20:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన మరో ప్రతిష్టాత్మక అవార్డుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో ఏపీకి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు దక్కింది. తద్వారా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఢిల్లీలో అవార్డు అందుకున్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. ఇదిలా ఉంటే.. బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి అవార్డు గురించి వివరించారు మంత్రి అమర్నాథ్‌. ఈ సందర్భంగా మంత్రిని సీఎం జగన్‌ అభినందించారు.

 పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల కల్పన విభాగంలో దేశంలోనే ఆంధప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు జె సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి ఎంపిక చేసింది. పెద్ద ఎత్తున పోర్టులను నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని..  అవార్డు కమిటీ సభ్యులు ప్రశంసించారు కూడా.

మరిన్ని వార్తలు