దావోస్‌ చేరుకున్న సీఎం జగన్‌

21 May, 2022 04:29 IST|Sakshi
గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం వైఎస్‌ జగన్‌కు వీడ్కోలు పలుకుతున్న సీఎస్, డీజీపీ  

అధికార బృందంతో కలిసి పయనం

గన్నవరం/ సాక్షి, అమరావతి: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ రాత్రి పొద్దుపోయాక దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.

పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లారు. కాగా, ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు.  

మరిన్ని వార్తలు