9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం భూమి పూజ

8 Jan, 2021 16:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి వేద పండితులు ఘనాపాటీలు ఆంజనేయ శర్మ , వివిఎల్‌ఎన్ ఘనాపాటి, వెంకటేశ్వర రావు, రామకృష్ణ ఆశీర్వచనాలు అందచేశారు. అనంతరం దేవాదాయ శాఖ రాష్ట్రంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు , బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త  తలశిల రఘురాం,   బ్రాహణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు పార్ధసారధి, జోగి రమేష్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కైలే అనిల్ కుమార్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జున రావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, విఎంసి కమీషనర్ ప్రసన్న వెంకటేష్, జేసి మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, దేవాదాయ అధికారి చంద్ర శేఖర్ ఆజాద్, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ  సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో రూపొందించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చూసి అధికారులను అభినందించారు. ఆయా దేవస్థానాల్లో నిర్వహించే వేడుకలను ప్రతిబింభించేలా క్యాలెండర్‌ను రూపొందించారు.

పునర్నిర్మించే ఆలయాలు ఇవీ..
1. రాహు – కేతు ఆలయం
2. సీతమ్మ పాదాలు
3. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)
4. శనైశ్చర ఆలయం
5. బొడ్డు బొమ్మ
6. ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)
7. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
8. వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో)
9. కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల 
చదవండి: (చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు)

>
మరిన్ని వార్తలు