నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

24 Dec, 2022 07:24 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలో మూడు నూతన జంటలను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారు (పరిశ్రమలు) రాజోలి వీరారెడ్డి కుమారుడు, కోడలు సాయి శరణ్‌రెడ్డి, జయశాంతిలను ఆశీర్వదించారు.

అనంతరం ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుమార్తె హారిక, అల్లుడు పవన్‌ కుమార్‌రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాధవీ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడు రషీద్‌ఖాన్, కోడలు డా.నిషా షేక్‌లను ఆశీర్వదించారు.   


  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు