గాయని వాణీ జయరాం మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

4 Feb, 2023 17:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: గాయని వాణీ జయరాం మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. పాన్-ఇండియా స్థాయిలో వాణీ జయరాం బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారని సీఎం జగన్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్‌ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు.

తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్‌ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం.
చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది! 

కాగా 1945 నవంబర్‌ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్‌ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షణ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు