జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు: సీఎం జగన్‌

14 Dec, 2021 18:35 IST|Sakshi

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, తాడేపల్లి: కొత్త ఏడాదిలో పెన్షన్‌ రూ.2500కు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్‌ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం.. డిసెంబర్‌, జనవరిలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్‌ 21న సంపూర్ణ గృహహక్కు పథకం, డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ 

జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని.. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు లబ్ధి చేకూరనుందన్నారు. జనవరిలోనే రైతు భరోసా అమలు చేస్తామని.. తేదీ త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

కోవిడ్‌లో కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ వచ్చిందని.. కొత్త వేరియంట్‌కు విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉందని సీఎం అన్నారు. ఏపీలో కరోనా రికవరీ రేటు 99.21 శాతంగా ఉందన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకం ద్వారా మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందన్నారు. సరసమైన ధరలకు లిటిగేషన్‌ లేని భూములు కేటాయింపులు చేస్తున్నామన్నారు. పథకం విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు.

వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందాలన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.

చదవండి: AP: రాబడిని మించిన జీతాలు

మరిన్ని వార్తలు