పోలీస్‌శాఖకు సీఎం అభినందన

23 Mar, 2021 05:39 IST|Sakshi
డీజీపీ సవాంగ్‌ను అభినందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో పోలీస్‌ అధికారులు కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, పాలరాజు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ సవాంగ్‌ 

సాక్షి, అమరావతి: పలు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇప్పటివరకు 125 జాతీయ అవార్డులు అందుకున్న నేపథ్యంలో సోమవారం డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ అవార్డులకు సంబంధించిన3 వివరాలను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దిశ’ కార్యక్రమానికి అనేక జాతీయ అవార్డులు దక్కాయని చెప్పారు.

తాజాగా జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీగా తనకు అవార్డు వచ్చిందని తెలిపారు. అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహించడంలో 13 జాతీయస్థాయి అవార్డులను రెండు రోజుల కిందట సాధించినట్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ డీజీపీ సవాంగ్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పోలీస్‌శాఖకు గౌరవ ప్రతిష్టలను పెంచాలని సీఎం ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ (డీజీ) కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ జి.పాలరాజు ఉన్నారు.  

మరిన్ని వార్తలు