కిడాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్‌

24 Jun, 2022 20:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌, డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కలిశారు. కాగా ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన థామస్‌ కప్‌ను భారత్‌ సాధించడంలో కిడాంబి శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించాడు. బధిరుల ఒలంపిక్‌ క్రీడల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తి చాటుతున్న వారివురిని సీఎం జగన్‌ అభినందించారు. జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: (CM Jagan: సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో 'ఏటీసీ టైర్స్' ప్ర‌తినిధుల భేటీ)

మరిన్ని వార్తలు