కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్‌

15 Apr, 2022 19:58 IST|Sakshi

కడప: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్లే మార్గంలోనే 108 అంబులెన్స్‌ రావడంతో దానికి దారిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకులకు హాజరయ్యే క్రమంలో కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఒక అంబులెన్స్‌ వెనకాలే వచ్చింది. అంబులెన్స్‌ సైరన్‌ వినగానే దానికి దారివ్వలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్‌. దాంతో అధికారులు కాన్వాయ్‌ను ఒక పక్కకు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. ఆపై సీఎం జగన్‌ ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రాముని  కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు