రాష్ట్రపతి‌ కోవింద్‌కు సీఎం జగన్‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

1 Oct, 2020 12:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ నేడు (గురువారం) 75వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా