నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

12 Mar, 2021 04:25 IST|Sakshi

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం సన్మానం  

‌సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సత్కరించనున్నారు.

ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 గంటలకు మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలోని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళతారు. ఆమెను, ఇతర కుటుంబసభ్యులను ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.  

చదవండి: (నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా)

>
మరిన్ని వార్తలు