ఇచ్చిన మాటకు కట్టుబడి.. జాహ్నవికి రూ.50లక్షల సాయం

16 Sep, 2022 21:20 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.50 లక్షల సాయం అందజేయడంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ దంగేటి జాహ్నవి ఆనందం వ్యక్తం చేసింది. జగనన్న మేలు మర్చిపోలేనిదని పేర్కొంది.

గురువారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల సమయంలో సీఎం రాజమండ్రి వచ్చినప్పుడు కలిశానని, ‘‘నీ విద్యకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు.. నీకు ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తా’’ అంటూ అప్పుడు ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది.


సీఎం భరోసాతో ఆస్ట్రోనాట్‌గా అవ్వాలన్న తన ఆశలు మరింత పెరిగాయంది. బుధవారం అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ప్రభుత్వం అందించిన రూ. 50 లక్షల చెక్కును జాహ్నవి అందుకుంది. 

చదవండి: (Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు)

మరిన్ని వార్తలు