గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్‌

8 Aug, 2023 15:37 IST|Sakshi

బాధితులకు బాసటగా.. కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

తోటరాముడివారిపేటలో బాధితులకు సీఎం జగన్‌ భరోసా

బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం

పంట నష్టం జరిగిన వెంటనే లెక్కలు కట్టి సాయం అందిస్తున్నాం

పేదలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తోడుగా ఉంటుంది.

ఇళ్లు దెబ్బతింటే సాయం అందించాలని ఆదేశించాం

ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు

వరద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ
కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురజపులంక, కూనలంకలో పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం జగన్‌ అన్నారు. ‘‘గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం. నేనే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తా అని చెప్పా. రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు.

వరద సాయం అందని ఇళ్లు లేదు: సీఎం జగన్‌
పంట నష్టం జరిగితే ఆర్భీకేల్లో నమోదు చేసుకోవాలి
రెండురోజుల్లో ఆర్భీకే కేంద్రాల్లో వరద బాధితుల జాబితా
నెలలోపే పంట నష్ట సాయం
గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా, వేగంగా అందించలేదు

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్ముడివరం మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో  సీఎం జగన్‌ పర్యటన.

ముమ్ముడివరం మండలంలో గురజపులంక, రామాలయపేట గ్రామాలలో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో మమేకమైన  సీఎం జగన్‌. 

ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై నేరుగా ప్రజలనుంచే తెలుసుకుంటూ... వారి విజ్ఞప్తులను స్వీకరించిన ముఖ్యమంత్రి.

గోదావరి వరద ప్రభా­విత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంకకు సీఎం చేరుకున్నారు. కాసేపట్లో వరద బాధితులను కలవనున్నారు.

గోదావరి వరద ప్రభా­విత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం  రాజమహేంద్రవరంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం నుంచి అర్ట్స్‌ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వద్ద హెలికాప్టర్‌లో బయలుదేరి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  గురజపులంక చేరుకుంటారు.

గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి  అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి చేరుకుంటారు. తర్వాత హెలికాప్టర్‌లో తాడేపల్లికి వెళతారు.  

కాగా, గోదావరి వరద ప్రభా­విత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూ­రు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం  ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. 

బాధితులకు అండగా.. 
హెలిపాడ్‌ నుంచి గెస్ట్‌ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనా­రోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్‌ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు.

మరిన్ని వార్తలు